టీడీపీ పాలనలో పడకేసిన గ్రామాలు

బనగానపల్లె నియోజకవర్గం ఇల్లూరు కొత్తపేట గ్రామంలో ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి అధ్వర్యంలో లో గడప గడపకు వైయస్సార్ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి ,జిల్లా సంయుక్త కార్యదర్శి గుండం శేషిరెడ్డిలు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి బాబు మోసాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. బాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రమాణస్వీకారం రోజు బాబు చేసిన ఐదు సంతకాలకే దిక్కులేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. మొదటి సంతకం విలువ గురించి చంద్రబాబు మహానేత వైయస్ఆర్ ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. గ్రామాన్ని దత్తతు తీసుకున్నట్లు ప్రకటించున్న ఎమ్మెల్యే ఇంతవరకు ఆ గ్రామానికి చేసిందేమీ లేదని టీడీపీ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి తీరుపై గౌరు వెంకట్ రెడ్డి, రామిరెడ్డిలు మండిపడ్డారు. 


తాజా ఫోటోలు

Back to Top