ఎమ్మెల్సీ అభ్యర్థులపై టీడీపీ నేతల దాడులు దారుణం

తిరుపతిః ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రతి చోట అధికార టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. స్వతంత్రంగా పోటే చేసే వాళ్లపై టీడీపీ నేతలు దాడులకు తెగబడడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల స్వేచ్ఛకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తానొక్కడినే ఉండాలన్న అహంకారంతో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరూ తనకు పోటీనే ఉండకూడదనే స్థాయికి బాబు, తన పార్టీ వెళ్లడం దారుణమన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న దాదాగిరిని ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని చంద్రబాబును హెచ్చరించారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి బాబు మోసాలను ఎండగట్టారు. 


Back to Top