శ్రీకాకుళంః 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి ఓటమి తథ్యమని పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజానీకమంతా ఆగ్రహంగా ఉన్నారని వివరించారు. పాలకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికీ తిరుగుతూ... ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజాబ్యాలెట్‌లను స్థానికులకు అందజేసి బాబు అవినీతి పరిపాలన తీరును ప్రజలకు వివరించారు. ప్రభుత్వం జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రజాభివృద్ధిని అడ్డుకుంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. <br/>