2019లో టీడీపీకి ఓటమి తప్పదు

పశ్చిమగోదావరి: తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్‌ నరసింహరాజు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పాలకోడూరు మండలం కొండేపూరిలో నరసింహరాజు ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ప్రజాశ్రేయస్సు కోసం చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై ప్రజలంతా వైయస్‌ఆర్‌ కుటుంబంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదన్నారు. కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే పాతపాటి స్రరాజు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు యోగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Back to Top