టీడీపీ అవినీతి పాలన

తూర్పుగోదావరిః ముమ్మిడివరం వెైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ అయినాపురం పంచాయతీ పరిధిలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజలు తమ సమస్యలను పితాని వద్ద మొరపెట్టుకున్నారు. రేషన్లు, పింఛన్లు రావడం లేదని..రుణాలు మాఫీ కాకపోవడంతో అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నామని, రహదారులు అధ్వాన్నంగా మారాయని, తాగునీటితో సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పితాని మాట్లాడుతూ...అమరావతి నిర్మాణం మొదలు అంతటా అవినీతే కనిపిస్తోందని పితాని అన్నారు. వరదలతో ముంపు బారిన పడిన వారికి ఆర్థిక సహాయం చేశారు. 

నెల్లూరు (సూళ్లూరుపేట)) వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కె.సంజీవయ్య పట్టణంలోని 4వ వార్డులో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని బాబు నెరవేర్చడం లేదని, తీవ్ర అవస్థలు పడుతున్నామని వాపోయారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని సంజీవయ్య ఆరోపించారు. మోసపూరిత చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

తాజా ఫోటోలు

Back to Top