కాపీ కొట్టడం టీడీపీకి అల‌వాటే

చిలకలూరిపేటటౌన్ (మంగ‌ళ‌గిరి):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలను కాపీ కొట్టడం టీడీపీకి అల‌వాటే అని పార్టీ సీనియర్‌ నాయకుడు,మురికిపూడి సొసైటి అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్య విమర్శించారు.33వ వార్డులో జరిగిన వైయ‌స్ఆర్ కుటుంబ స‌భ్య‌త్వ నమోదు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వైయ‌స్ఆర్‌ కటుంంబ కార్యక్రామన్ని ప్రకటించగానే.. టీడీపీ ఇంటింటికి కార్యక్రమం చేపట్టి అభాసుపాలయ్యిందన్నారు. వార్డుల్లో తిరిగితే ప్రజలు మంత్రిని సైతం నిలదీసే పరిస్థితులు ఉన్నాయన్నారు. టీడీపీ యువకులకు వాళ్ల పార్టీ కండువాలు కప్పి కొత్తగా పార్టీలో చేరుతున్నట్లు చూపించడం మంత్రి పుల్లారావుకే చెల్లిందన్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి వైయ‌స్ఆర్ కుటుంబంలోకి చేర్పించారు. నవరత్నాల పథకం అమలైతే అన్నీ వర్గాల ప్రజల సమస్యలు తీరుతాయని ప్రజలకు భరోసానిచ్చారు.పార్టీ బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నిడమానూరు హనుమంతరావు,మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ అబ్దుల్లా,నాయకులు జంజనం వెంకటరావు,సాతులూరి కోటి,సాపా సైదావలి,సాకిరి శేషయ్య నాయుడు,బండారు దాసు,పూర్ణ తదితరులున్నారు.

Back to Top