టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయి

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు అన్నారు. మాడుగుల నియోజకవర్గ పరిధిలోని దేవరాపల్లి మండలం బోయలకిండాట, రైవాడ గ్రామాల్లో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్యాల నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రజలకు వైయస్‌ఆర్‌ కుటుంబంలో భాగస్వాములను చేశారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బూడి వెంకటేష్, బాబురావు, క్రరి సత్యం, రాము తదితరులు పాల్గొన్నారు. 

కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో..
చోడవరం నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో ఇంటింటికీ వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని బుచ్చయపేట మండలం నీలకంఠాపురం, రాజం, సీతయ్యపేట గ్రామాల్లో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు.
Back to Top