వంగర: జగన్‌తోనే రాజన్నరాజ్యం సాధ్యమవుతోందని వైయస్సార్ సీపీ నేత వావిలపల్లి రంగునాయుడు అన్నారు. శనివారం మండల పరిధి ఎం.సీతారాంపురంలో వైయస్సార్ కుటుంబం నిర్వహించారు. 30 కుటుంబాలను వైయస్సార్‌కు టుంబం కాల్‌సెంటర్‌కు మిస్డ్‌కాల్ ఇచ్చి చేర్పించారు. వైయస్సార్ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టనున్న నవరత్నాల పథకాల ఆవశ్యకతను వివరించారు. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రజా సంకల్పయాత్ర పేరిట జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్నారని, జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సీపీ నాయకులు కాంబోతుల సదానందంనాయుడు, కె.ఉమామహేశ్వరరావు, కె.రాము, కర్రి గోపాల్, మజ్జి పకీరునాయుడు, బొమ్మిరెడ్డిపల్లి గోవింద, వి.ఆదినారాయణ, కె.జోగులు, కె.శ్రీను,వి.రామకృష్ణ, వి.రాము తదితరులు పాల్గొన్నారు.<br/>