గడప గడపలో గోడు

  • తూర్పు గోదావరి జిల్లాలో విస్తృతంగా గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం
  • గ్రామాల్లో వెల్లువెత్తున్న సమస్యలు
  • బయటపడుతున్న చంద్రబాబు మోసాలు
  • అండగా ఉంటామని భరోసానిస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు
తూర్పు గోదావరి జిల్లా: గత రెండున్నరేళ్లుగా ఎన్నో సార్లు అధికారుల చుట్టు తిరిగాం అనేక దరఖాస్తులు పెట్టాం అయినా మా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. మాగోడు మీరైనా పట్టించుకోండి,  మా తరుపున ప్రభుత్వంపై పోరాటం చేయండి అంటు తూర్పు గోదావరి జిల్లా ప్రజలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను వేడుకుంటున్నారు. జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి అంతంత మాత్రమే. ప్రజా సమస్యలు పరిష్కరించే నాథుడు కరువయ్యారు. పింఛన్లు మంజూరు కావాలంటే టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని చెబుతున్నారు. రేషన్‌ కార్డు కావాలంటే జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. వారం రోజులుగా  పిఠాపురం మున్సిపాలిటీలో పార్టీ పట్ణ అధ్యక్షుడు బొజ్జా రామయ్య ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే,  పిఠాపురం నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ కో–ఆర్డినేటర్‌ పెండెం దొరబాబు , మున్సిపల్‌ కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గండేపల్లి బాబీ, జిల్లా ఆర్గనైజింగ్‌ శక్రటరీ కురుమళ్ల రాంబాబు తదితరులు పర్యటిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 14 వ వార్డులో నాయకులు స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురు  కార్మికులు, విద్యార్థులను, మహిళలను, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను పలకరిస్తే..వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోయామని వాపోయారు. వైయస్‌ఆర్‌సీపీ రూపొందించిన 100 ప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్‌ను పంపిణీ చేయగా అందులో బాబు పాలనకు పాస్‌మార్కులు రాలేదు. ఆయా కాలనీలకు వెళ్లిన పార్టీ నేతలకు మహిళలు బారులుతీరి మంగళహారతులు ఇస్తు స్వాగతం పలికారు. ఎవరిని పలకరించినా తమ ఆవేదన నాయకుల వద్ద వెల్లిబుచ్చారు. 14 వవార్డులో సుమారు 150 ఇళ్ల వద్దకు తిరిగిన నాయకులు స్థానికుల సమస్యలు అడిగతెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి కరపత్రాన్ని పంచుతు తమ అభిప్రాయాలను జవాబుల రూపంలో ఇవ్వాలని కోరారు. అలాగే ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడ చూసినా స్థానికులు తమ సమస్యలను పట్టించుకునే వారు లేరని కేవలం అధికారపార్టీకి చెందిన వారికే పనులు చేస్తున్నారని ఇలా ఐతే సామాన్య ప్రజలు బతికేదెలాగని ఏకరవుపెట్టారు. ముఖ్యంగా వార్డులో వితంతు , వికలాంగ, వృద్దాప్య పించన్లు లేక అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటు ఆందోళన వ్యక్తం చేసారు. స్థానికంగా  నెలకొన్న పారిశుధ్ద్య సమస్యపై పలువురు ఆందోళన వ్యక్తం చేసారు. ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను దుమ్మెత్తి పోస్తున్నారు.  ప్రస్థుతం పట్టణంలో ఎక్కడ చూసినా డ్రైన్లు అధ్వాన్నంగా మారడంతో దోమలు క్రిమి కీటకాదులు పెరిగిపోయి అంటు వ్యాధులు ప్రబలి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మున్సిపాలిటీ సిబ్బంది వచ్చినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసారు. దీనిపై స్పందించిన దొరబాబు అక్కడి నుంచే స్థానిక అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనేచర్యలు తీసుకునే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. 

తాజా ఫోటోలు

Back to Top