బాబు పాలనపై కన్నెర్ర

తూర్పుగోదావరిః ముమ్మిడివరం నియోజకవర్గం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలొ తాళ్ళరేవు మండలము,కొరంగి పంచాయతీ లో గడప గడప కు వెైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి పితాని ప్రజలకు బాబు మోసపూరిత హామీలపై కరపత్రాలు అందించి మార్కులు వేయించారు. ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పింఛన్లు, రేషన్ లు ఇవ్వడం లేదు. రోడ్లు, డ్రైనేజులు అధ్వాన్నంగా మారాయి. మురుగునీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వాపోయారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఒక్క ఇళ్లు ఇచ్చిన పాపాన పోలేదని బాబుపై మండిపడ్డారు. వెంకటాయపాలెం గ్రామానికి చెందిన 50 మంది మత్స్యకారులు వైయస్సార్సీపీలో చేరారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని వైయస్సార్సీపీ విజయానికి కృషి చేయాలని పితాని సూచించారు.


Back to Top