బాబును గ‌ద్దె దించేందుకు ప్ర‌జ‌లు సిద్ధం

తూ.గోదావ‌రిః చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఎప్పుడెప్పుడు గ‌ద్దెదించాల‌ా అని ప్ర‌జ‌లంతా వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ పితాని బాలకృష్ణ తెలిపారు. తూర్పుగోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని గున్నేప‌ల్లి పంచాయ‌తీ ప‌రిధిలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి పితాని ముఖ్య అతిథిగా హాజ‌రై చంద్ర‌బాబు మోసాల‌ను ఎండ‌గ‌ట్టారు. ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు అబ‌ద్ధ‌పు హామీలిచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌లంతా చంద్ర‌బాబు పాల‌న‌పై ఆగ్ర‌హంగా ఉన్నార‌న్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top