సంక్షేమ పథకాలకు కోత విధిస్తున్నారు
నెల్లూరు: నెల్లూరు నగరంలోని 7,15, 50 వ డివిజన్ ప్రాంతాలలో నెల్లూరు ఎమ్మెల్యే పి. అనిల్‌కుమార్ యాదవ్ పార్టీ నాయకులతో కలిసి గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ... చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛన్లు, రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజురీయంబర్స్‌మెంట్ వంటి ఎన్నో పథకాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. నగరంలోని ప్రధాన కాలువలన్నీ పూడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అప్పటికప్పుడు నామమాత్రంగా పూడికతీత పనులు చేపట్టి చేతులు దులుపుకోవడం సరికాదని పాలకులు, అధికారుల తీరుపై మండిపడ్డారు. మరోవైపు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.42 కోట్లు వచ్చినా ఎస్సీకాలనీలకు నిధులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు.
జగనన్న సీఎం అయితేనే
కనిగిరి: కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని 10వ వార్డు వాసులు వైయస్సార్‌సీపీ నియోజకవర్గ ఇంచార్జీ మధుసూధన్‌కు విన్నవించారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా పాతూరు, హనీఫ్‌నగర్, బీసీకాలనీల్లో మధుసూధన్ పర్యటించి, చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించారు. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నను సీఎం చేయాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసానిచ్చారు.
బాబు పాలనలో అన్నీ సమస్యలే
అరకువెలి: గడపగడపకూ సమస్యలే దర్శనమిస్తున్నాయని అరకు నియోజకవర్గ సమన్వయకర్త అరుణకుమారి పేర్కొన్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని అధికార ప్రతినిధి అప్పాలుతో కలిసి అరకులో నిర్వహించారు. ఈసందర్భంగా అరుణకుమారి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసిన సమస్యలే దర్శనమిస్తున్నాయన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజలు విసుగుపోయారన్నారు. చంద్రబాబు దుర్మార్గ పాలనకు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అరుణకుమారి తెలిపారు.