‘ నవ రత్నాలతో నవ శకానికి నాంది’

తనకల్లు: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నవ రత్నాల పథకాలతో రాష్ట్ర చరిత్రకు నవ శకం ప్రారంభం కానున్నట్లు ఆ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సిద్ధారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన తనకల్లులో బుధవారం వైయస్సార్‌ కుటుంబ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని 271 పోలింగ్‌ కేంద్రాల పల్లెలలో పార్టీ పోలింగ్‌ బూత్‌ కమిటీ సభ్యులు ఇంటింటా తిరిగి అత్యధిక సంఖ్యలో పార్టీ సభ్యత్వాలను నమోదు చేయించనున్నట్లు తెలియజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా వైయస్సార్‌ సీపీ అద్భుతమైన ఆదరణ ప్రజల నుంచి లభిస్తున్న సంగతి తాను క్షేత్రస్థాయిలో గమనించానన్నారు. తమ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలాంటి తొమ్మిది పథకాలు రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల జీవితాలను పూర్తిగా మార్చి వేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం 233 పోలింగ్‌ బూత్‌కు సంబంధించిన ప్రాంతాల్లో ఇంటింటా తిరిగి, పలువురికి వైయస్సార్‌ కుటుంబంలో చేర్పించారు. ఆయన వెంట మండల కన్వీనర్‌ మధుసూదన్‌రెడ్డి, మైనార్టీ మండల కన్వీనర్‌ బీఎస్‌ తబ్రేజ్, సీఆర్‌ పల్లి సర్పంచ్‌ చాంద్‌బాషా, ఉప సర్పంచ్‌ తబ్రేజ్, నాయకులు శివరాంరెడ్డి, బాబు, ఖాజాపీర్, వార్డు మెంబర్‌ తిమ్మన్న, మాబ్బాష తదితరులు ఉన్నారు.

Back to Top