టీడీపీ పాలనకు చరమగీతం పాడుదాం

గుంటూరుః మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బాబు ఇచ్చిన హామీల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కరపత్రాలు అందించి సమాధానాలు రాబట్టారు. బాబు పాలనకు ప్రజలు సున్నా మార్కులు వేశారు.  ప్రతీ ఒక్కరూ తమ సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పుకొని విలపించారు. బాబు అబద్ధపు హామీలు నమ్మి ఓట్లేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మోసపూరిత పాలన సాగిస్తున్న టీడీపీకి చరమగీతం పాడాలని ఆర్కే ప్రజలకు పిలుపునిచ్చారు. 


Back to Top