ప్ర‌జ‌ల ముంగిట నాయ‌కులు

విశాఖ‌ప‌ట్నం)) గ‌డ‌ప గ‌డ‌ప‌కూ కార్య‌క్రమాన్ని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఉత్సాహంగా నిర్వ‌హిస్తున్నారు. విశాఖ‌ప‌ట్నం ఏజ‌న్సీలో వైయస్సార్సీపీ నేత‌లు మారుమూల గ్రామాల‌కు వెళుతున్నారు. అక్క‌డ గిరిజ‌నులు, ప‌ల్లె ప్ర‌జ‌ల్ని ప‌ల‌క‌రిస్తున్నారు. క‌ష్ట సుఖాలు అడిగి తెలుసుకొంటున్నారు. 
విశాఖ జిల్లా చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ బుచ్చ‌య్య‌పేట మండ‌లంలో ప‌ర్య‌టించారు. అక్క‌డ మ‌ల్లం గ్రామంలో ఆయ‌న ప్ర‌తీ ఇంటికి వెళ్లారు. వైయ‌స్సార్సీపీ క‌ర‌ప‌త్రాన్ని అంద‌చేశారు. త‌ర్వాత అక్క‌డ గుడిలో స్థానికుల‌తో స‌మావేశం అయ్యారు. ప్ర‌జ‌ల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకొన్నారు. అధికారుల‌తో మాట్లాడి ప‌రిష్కారానికి కృషి చేస్తామ‌ని పేర్కొన్నారు. 
Back to Top