వైయస్‌ జగన్‌తో కొణతాల రామకృష్ణ‌ భేటి

ఉత్తరాంధ్ర సమస్యలపై చర్చ 

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరిన కొణతాల

హైదరాబాద్‌:  ఉత్తరాంధ్ర చర్చ వేదిక నాయకులు, సీనియర్‌ నేత కొణతాల రామకృరామకృష్ణ‌ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సమస్యలపై జననేతతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి నీళ్లు, నిధులు, నియామకాలు కల్పించాలని, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వైయస్‌ జగన్‌తో మాట్లాడామని చెప్పారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో స్వయం ప్రతిపాదిక సంస్థలు ఉండేవని, మహానేత మొదలుపెట్టిన ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరామన్నారు. పురుషోత్తంఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని కోరామన్నారు. స్టీల్‌ ప్లాంట్‌కు నిధులు కేటాయించాలని, శ్రీకాకుళంలో జాతీయ విద్యా సంస్థ ఏర్పాటు చేయాలని, ఉత్తరాంధ్రలో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. విజయనగరం ఒకప్పుడు కళలకు మొదటిస్థానంలో ఉండేదన్నారు. మత్సకారులు, దళితులు, గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలని వైయస్‌ జగన్‌తో చర్చించామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారన్నారు. 

 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top