గడప గడపకూ వైయ‌స్సార్ సీడీ ఆవిష్కరణ

హైదరాబాద్:  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్‌... గుండె గుండెకూ వైయ‌స్సార్ పాట‌ల సీడీని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పార్టీ ఆఫీస్ లో ఆవిష్కరించారు.  అనంత‌రం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ... కృష్ణా జిల్లా జి.కొండూరు ఎంపీపీ వేములకొండ తిరుప‌తిరావు రూపొందించిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్‌... గుండె గుండెకూ వైయ‌స్సార్ పాట‌లు ప్ర‌జ‌ల‌ను మ‌రింత ఉత్తేజ ప‌రుస్తాయ‌ని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. సీడీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ నేత‌లు జోగిర‌మేష్‌, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, హరీష్ (యువజన విభాగం), నాగార్జున యాదవ్ (విద్యార్థి విభాగం) కృష్ణా జిల్లా వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు శివరామకృష్ణ, వేములకొండ విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Back to Top