హామీలు నెరవేర్చడంలో విఫలం

విశాఖ))ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త తైనాల విజయకుమార్ ఆధ్వర్యంలో 36వ వార్డు, అశోక్ నగర్ లలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా స్థానిక సమస్యలను ప్రజలు తైనాల వద్ద మొరపెట్టుకున్నారు. రేషన్లు, పింఛన్లు సక్రమంగా రావడం లేదు. రోడ్లు, డ్రైనేజీలు అధ్వాన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు ఒక్కటి కూడా తమకు అందడం లేదని వాపోయారు. మోసపూరిత ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బాబు అవినీతి పాలనను గడపగడపలో ఎండగట్టారు. 

తూర్పుగోదావరి))మండపేట పట్టణంలోని 1వ వార్డులో సత్యప్రసాద్, పోతంశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ పట్టాబి రామయ్యచౌదరి, రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించాలని రామచ్చచౌదరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డ్వాక్రా, బంగారంపై రుణాలు మాఫీ అవుతాయని నమ్మి బాబుకు ఓటేసి మోసపోయామని పలువురు మహిళలు పట్టాబి వద్ద వాపోయారు. హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని పట్టాబి మండిపడ్డారు. 

Back to Top