ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ

శ్రీకాకుళంః టీడీపీ ఆరిపోయే దీపమని వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్ విమర్శించారు. గడప గడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం కొత్తరేవు గ్రామపంచాయతీలో గల పరపతివానిపేట, కంబాలవానిపేట,అక్కువరం, కోవిరిపేట మత్స్యకారుల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ...చంద్రబాబు ప్రభుత్వం దొడ్డిదారిన స్థానికసంస్థల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకొందని, వాపును చూసి బలుపు అనుకుంటోందని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు రావాలన్న తమ నాయకుడు సవాల్ ను ప్రభుత్వం స్వీకరించాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలెవరూ అధైర్యపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. ప్రభుత్వానికి ప్రజల్లో బలం లేకనే లోకేష్ ను దొడ్డిదారిని మండలికి పంపించిందని ఎద్దేవా చేశారు.


Back to Top