సాదర స్వాగతంకర్నూలు(ఆళ్లగడ్డ): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమానికి ప్రజలు సాదర స్వాగతం పలుకుతున్నారు. తమ సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన నాయకులకు హారతులిచ్చి స్వాగతిస్తున్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇంచార్జ్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఎస్. లింగందిన్నె గ్రామంలో కొనసాగింది.
రాజధాని పేరుతో రైతులకు అన్యాయంశ్రీశైలం(బండి ఆత్మకూరు): రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని వైయస్సార్ సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ బుడ్డా శేషారెడ్డి మండిపడ్డారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన లింగాపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మోసాలను వివరించారు. అనంతరం వందప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్‌ను ప్రజలకు ఇచ్చి చంద్రబాబు మోసపూరిత పాలనను ఎండగట్టారు.
బాబు పాలనకు చరమగీతం పాడుదాంనంద్యాల(నూనెపల్లె): చంద్రబాబు అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని వైయస్సార్‌సీపీ నంద్యాల నియోజకవర్గ ఇంచార్జ్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన మండల పరిధిలోని ముల్లాన్‌పేట, ఇస్లాంపేట, పట్టణంలోని 19వ వార్డులోని ఆర్‌డీఓ కార్యాలయ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, ప్రజాబ్యాలెట్‌ను అందజేశారు.