విస్తృతంగా గడప గడపకూ వైయస్‌ఆర్‌

తూర్పు గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలతో తూర్పు గోదావరి జిల్లాలో గడప గపడకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు.  అమలాపురం రూరల్‌ మండలం వేమవర ప్పాడులో నిర్వహించిన గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ కో–ఆర్డినేటర్‌ పినిపే విశ్వరూప్, చిట్టబ్బాయి పాల్గొన్నారు. ఐ. పోలవరం మండలం కేశకురుపాలెలంలో గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమంలో నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ, శ్రీనివాసరాజు, కనకరావు, ప్రసాద్, రవి కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మూడేళ్ల పాలనలో చంద్రబాబు చేసిన మోసాలను వారు ఎండగట్టారు. అనంతరం ఇంటింటా పర్యటించి ప్రజాబ్యాలెట్‌ను పంపిణీ చేశారు.

Back to Top