ప‌లాస‌లో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్‌

శ్రీకాకుళం: పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేట పంచాయతీ కొత్తపేట,  దిబ్బవానిపేట గ్రామాల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త సీదిరి అప్ప‌ల‌రాజు ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డి శాంతి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికీ తిరుగుతూ.. చంద్ర‌బాబు మోస‌పూరిత‌, అవినీతి ప‌రిపాల‌న‌పై ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Back to Top