యర్రాయపల్లిలో గడప గడపకూ వైయస్సార్‌

బత్తలపల్లిః మండలంలోని సంజీవపురం పంచాయతీ పరిధిలోని యర్రాయపల్లిలో శుక్రవారం గడప గడపకూ వైయస్సార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైయస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top