కాళ్లు చచ్చుబడినా కనికరం లేదు
అనంతపురం(పుట్టపర్తి): కాళ్లు, వెన్నముక చచ్చుపడింది. నడవలేక వికలాంగుడిని అయ్యాను. పని చేసే శక్తి లేక కుటుంబం గడవడం కష్టమై పోయింది. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పింఛన్ రావడం లేదని రాయవారిపల్లికి చెందిన వికలాంగుడు కిష్టప్ప ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గ వైయస్సార్‌సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అదన్నారు.. ఇదన్నారు.. ఏదీ లేదు
అనంతపురం(హిందూపురం): అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. ఏ ఒక్కటీ చేయడం లేదని రహమత్‌పురం వాసి రబియా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. హిందూపురం మున్సిపల్ పరిధిలోని 15, 16 వార్డుల్లో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో కొనసాగింది. ఎన్నికలప్పుడు ఇళ్లు ఇస్తామన్నారు. డ్వాక్రా లోన్లు మాఫీ చేస్తామన్నారు. ఏవీ చేయడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యలపై ఎన్నిసార్లు నిలదీసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని నవీన్ దృష్టికి తెచ్చారు.
వడ్డీ కట్టలేకపోతున్నాం
అనంతపురం(తాడిపత్రి టౌన్): మేం అధికారంలోకి వస్తే లోన్లన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడేమో లోన్లు మాఫీ కాలేదు. వాటికి వడ్డీ కట్టలేక చస్తున్నామంటూ డ్వాక్రా మహిళలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడిపత్రి నియోజకవర్గ అదనపు సమన్వయకర్త రమేష్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానిక మున్సిపల్ పరిధిలోని కృష్ణాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇంటిపట్టాలు, పక్కా ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు.