పింఛన్ల మంజూరులో వివక్ష

తిరువూరు: అర్హులకు సామాజిక పింఛన్లు మంజూరు చేసే విషయంలో వివక్ష చూపుతున్నారని ఎమ్మెల్యే రక్షణనిధి మండిపడ్డారు. తిరుపూరు మండలంలోని లక్ష్మీపురం ఎస్సీ కాలనీ గురువారం ఆయన గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించి, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నున్నా వెంకటకృష్ణారావు, నరేష్, సర్పంచి వేముల సుజాత, గ్రామ పార్టీ నాయకులు సీతయ్య, నిరంజన్, వెంకటరమణ, మండల పార్టీ అధ్యక్షుడు శీలం నాగనర్సిరెడ్డి, యువజన విభాగ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రైతువిభాగ జిల్లా కమిటీ సభ్యుడు ఆలపాటి శ్రీనివాసరావు, మండల, జిల్లా పార్టీ సభ్యులు పరసా శ్రీనివాసరావు, చిప్పగిరి అంజారావు, కాలసాని నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసరావు,  తదితరులు పాల్గొన్నారు.

Back to Top