క‌ష్టాలు తెలుసుకుంటూ

ప్ర‌కాశం జిల్లాలో దిగ్విజ‌యంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్‌
ప్ర‌కాశం:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.  ప‌్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాలు తెలుసుకుంటూ..వారి క‌న్నీళ్లు తుడుస్తూ భవిష్య‌త్తుకు భ‌రోసానిస్తున్నారు.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు ప్ర‌కాశం జిల్లాలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్ర‌జ‌ల బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. పార్టీ రూపొందించిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి చంద్ర‌బాబు మోసపూరిత పాల‌న‌పై మార్క‌ులు వేయిస్తున్నారు.

-చీరాల నియోజ‌క‌వ‌ర్గం వేటపాలెం మండలంలోని  నాయినిపల్లి శివాలయం వీధిలో గడప_గడపకు_వైయస్ఆర్ కార్యక్రమాన్ని పార్టీ ఇన్‌చార్జ్  యడం_బాలాజీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌జాబ్యాలెట్ పంపిణీ చేసి చంద్ర‌బాబు మోసాల‌ను ఎండ‌గ‌ట్టారు. కార్య‌క్ర‌మంలో పార్టీ మండ‌ల‌ అధ్యక్షులు కోలుకుల వెంకటేశ్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

- మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని త‌ర్లుపాడు మండ‌లం నాజెండ్ల‌ముడుపు గ్రామంలో ఎమ్మెల్యే జంకె వెంక‌ట‌రెడ్డి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకొని, వాటి ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు.
 
- -ఉలవపాడు మండలంలోని రామయపట్నం పంచాయతీ లోని రెడ్డిపాలెం, నరుసుగుంటదిబ్బ సంగం లో వైయ‌స్ఆర్‌సీపీ కందుకూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ తూమాటి మాధవ రావు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా  ఆయ‌న మాట్లాడుతూ.. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆయన మరణానంతరం సక్రమంగా అమలు జరగడం లేదని, ప్రస్తుత తెలుగుదేశ  ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని , ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇచ్చే  విషయంలో కేంద్రప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిప‌డ్డారు. ప్రత్యేక హోదా పోరాటంలో యువత  ముందుండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు శ్రీ రామాల సింగారెడ్డి , కందుకూరు రూరల్ యూత్ అధ్యక్షులు   పొడపాటి కోటేశ్వరరావు, కందుకూరు టౌన్ యూత్ అధ్యక్షులు   రఫీ, రాష్ట్ర యువజన కార్యవర్గ సభ్యుల  గంగి రెడ్డి  , గూడ్లురు ప్రచార కమిటీ అధ్యక్షులు  మధు , ఇయ్యళ రామూర్తి గారు, హరిబాబు గారు, కొండయ్య గారు, వెంకటేశ్వర్లు గారు, శ్రీను త‌దిత‌రులు పాల్గొన్నారు.

-కంభం మండలం యల్..కోట గ్రామం లో గిద్ద‌లూరు పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఐవీ రెడ్డి గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయస్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైయ‌స్ఆర్ సీపీ చేస్తున్న పోరాటాల‌ను వివ‌రించారు. 

Back to Top