నవరత్నాలతో అన్ని వ‌ర్గాల అభివృద్ధి

క‌మ‌లాపురం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌తో అన్ని వ‌ర్గాల అభివృద్ధి సాధ్య‌మ‌ని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాదరెడ్డి తెలిపారు. వైయ‌స్‌ఆర్‌ కుటుంబంపై సోమవారం వీరపునాయునిపల్లెలో బూత్‌ స్థాయి కార్యకర్తలకు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మంచి పాలన అందచేసేందుకు నవరత్నాలు ప్రవేశపెడుతున్నాడని తెలిపారు. ఈ నవరత్నాల గురించి ప్రతి కుటుంబానికి తెలియచేయాలని సూచించారు. ఇదే సందర్భంలో వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలను గురించి వివరించి వారు వైయ‌స్‌ఆర్‌ కుటుంబంలో చేరేలా చూడాలని తెలిపారు. కుటుంబ పెద్దతో మిస్‌కాల్‌ ఇప్పించి వారు వైయ‌స్‌ఆర్‌ కుటుంబంలో చేరేలా చూడాలని కోరారు. అదే విధంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వాగ్దానాలు, ప్రభుత్వ వైపల్యాలను గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రతి కుటుంబం వైఎస్‌ఆర్‌ పార్టీకి చేరువ అయ్యేలా చూడాలని, ఈ కార్యక్రమాన్ని సక్రమంగా చేపడితే రాబోయే ఎన్నికలలో వైయ‌స్ జగన్‌మోహనరెడ్డి సీఎం కావడం, ప్రజలకు సువర్ణపాలన అందచేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం కార్యక్రమాల అమలు గురించి వివరించారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్‌ రఘునాధరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరప్రతాపరెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ సుదర్శనరెడ్డి లతో పాటు పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top