బాబు పాలనకు నూకలు చెల్లాయి

తమ్ముళ్ల పేకాట
కర్నూలు(బనగానపల్లె)మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో కొలిమిగుండ్ల మండలంలోని తుమ్మలపెంటలో గడపగడపకూ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాగునీరు లేక అల్లాడుతున్నామని, మరుగుదొడ్లు లేక బయటకు వెళ్లాల్సి వస్తుందని, రుణ మాఫీ జరగలేదని ఈసందర్భంగా మహిళలు రామిరెడ్డి వద్ద తమ ఆవేదన వెలిబుచ్చారు. .ప్రజా సమస్యలపై పార్టీ పరంగా పోరాడతామని ఆయన హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఎన్నికలకు ముందు సీఎం కంటే ఎక్కువ హామీలు గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. మండలంలో పేకాట క్లబ్‌ను మూసేస్తే తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యాలయాన్నే పేకాట క్లబ్‌గా మార్చారని ఎద్దేవా చేశారు. చెంతనే సిమెంట్‌ పరిశ్రమ ఉన్నా స్థానికులకు ఉద్యోగాలు కేటాయించకుండా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ఉద్యోగాల్లో పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

సమస్యలు ఏకరువు
నంద్యాల)) చంద్రబాబు పాలనకు ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరపడ్డాయని నంద్యాల వైయస్సార్‌సీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చేబ్రోలు తదితర గ్రామాల్లో జరిగిన గడపగడపకు వైయస్సార్‌సీపీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.  గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి శిథిలైపోయిందని, చిన్న వర్షం కురిసినా గ్రామంలోని మురుగు కాల్వలు నిండి మురుగు రోడ్లపై ప్రవహిస్తుందని దీంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామస్తులు రాజగోపాల్ రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చేబ్రోలు సీఎస్‌ఐ చర్చి వద్ద  వంద మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.  

మోసకారిగా చరిత్రలో నిలిచిపోతారు
శ్రీశైలం))  ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసకారిగా చరిత్రలో నిలిచిపోతారని శ్రీశైలం నియోజకవర్గ వైయస్సార్‌సీపీ ఇన్‌చార్జి బుడ్డా శేషారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఖల్లా వీధిలో గడపగడపకు వైయస్సార్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడుతూ ...రాష్ట్రాభివృద్ధి  కోసం ప్రత్యేక హోదాకు కోసం పోరాడాల్సింది పోయి బాబు ప్యాకేజీల కోసం పట్టుబట్టడం సిగ్గుచేటన్నారు.  

 
Back to Top