దళితుల అభివృద్ధికి తూట్లు పొడుస్తున్నారు

నందికొట్కూరు: దళితవాడల అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. మండల పరిధిలోని కొణిదెల గ్రామంలో ఎమ్మెల్యే గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను మంజూరు చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో చేసి చూపించడంలేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు దళితుల అభివృద్ధికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. 

నంద్యాల నియోజకవర్గం: అధికారం కోసం మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను పట్టించుకోని ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తేళ్లపురిలో శుక్రవారం గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజా బ్యాలెంట్‌ పత్రాలు అందజేశారు.

Back to Top