రాష్ట్రంలో అవినీతి పాలన

ప్రకాశంః ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు డబ్బులివ్వడం లేదని ఎన్. బయనపల్లి గ్రామస్తులు వాపోయారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా వైయస్సార్సీపీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐవీరెడ్డి బయనపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. బాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు.


Back to Top