సీఎం చొర‌వ‌తో 5.94 ల‌క్ష‌ల మంది రైతుల‌కు మేలు

2018 రబీ పంట బీమా సొమ్ము రూ.596 కోట్లు విడుదల చేసిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ‘రైతు సంక్షేమ కోసం నాన్న గారు ఒక అడుగు ముందుకేస్తే.. నేను రెండు అడుగులు ముందుకేస్తా’నని చెప్పిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆచరణలో చూపిస్తున్నారు. రైతు క్షేమమే.. రాష్ట్ర సంక్షేమమని నమ్మిన సీఎం వైయస్‌ జగన్‌ అన్నదాతలను ఆదుకునేందుకు ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. గత టీడీపీ ప్రభుత్వం 2018 రబీకి సంబంధించి రైతులకు చెల్లించిన బీమా సొమ్మును చెల్లించకుండా ఎగనామం పెట్టింది. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రైతు బీమా సొమ్ము రూ.596 కోట్లను సీఎం వైయస్‌ జగన్‌ నేడు విడుదల చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులతో మాట్లాడిన అనంతరం లాప్‌టాప్‌ బటన్‌ నొక్కి 2018–19కి సంబంధించి రబీ పంట బీమా సొమ్ము రూ.596 కోట్లను విడుదల చేశారు. దీని ద్వారా 5.94 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. 

Back to Top