మానసిక రోగిలా మారిన ముఖ్యమంత్రి

నెల్లూరు నగరంలోని 47వ డివిజన్‌లో గుప్తాపార్కు, అగ్నిపేట, సవరాలవీధి, కుక్కులగుంట, ఆజాద్‌ సెంటర్‌ ప్రాంతాలలో ఆ డివిజన్‌ వైయస్‌ఆర్‌సీపీ ఇంచార్జ్ శివపురం సురేష్‌ ఆధ్వర్యంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే డా.పి. అనిల్‌కుమార్‌ యాదవ్‌ గడపగడపకు వైయస్‌ఆర్‌సీపీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎక్కువగా పెన్షన్‌లు, రేషన్‌కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో తనకే అర్ధంకాని పరిస్థితిలో ఉన్నారన్నారు. 


రోజుకో మాట మారుస్తున్న చంద్రబాబు లాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యమన్నారు. నోట్ల రద్దుపై గత నెల రోజులుగా ఆయన మాట్లాడుతున్న మాటలే చంద్రబాబు నిలకడలేని తనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానసిక రోగిలా మారిన ముఖ్యమంత్రిని చూస్తుంటే చాలా బాధ కలుగుతుందని చమత్కరించారు. మాటలు చెప్పడమే తప్ప పనులు చేయడం చేతకాని ముఖ్యమంత్రి చంద్రబాబు అని విమర్శించారు. 3.5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణకు 24 వేల కోట్ల కొత్త కరెన్సీ వస్తే 5.5 కోట్లు జనాభా ఉన్న ఏపీకి మాత్రం వచ్చింది కేవలం 14 వేల కోట్లేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అసమర్థతకు ఇంతకన్నా రుజువులు అవసరం లేదన్నారు.
Back to Top