రుణమాఫీ పేరుతో మోసం

గోనెగండ్ల: ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని చెప్పుకున్న టీడీపీ ప్రభుత్వం తమకు మాత్రం మొండి చేయి చూపిందని అప్పులు తీర్చేందుకు బయట వడ్డీకి అప్పు చేయాల్సివ‌స్తుంద‌ని లక్ష్మయ్య అనే రైతు మొర పెట్టుకున్నాడు. గడప గడపకూ వైయ‌స్ఆర్ కార్యక్రమంలో భాగంగా గోనెగండ్ల‌ మండల పరిధిలోని తిప్పనూరు గ్రామంలో వైయ‌స్ఆర్ సీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌ ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు.ఇందులో భాగంగా ఆయన ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వం మోసంచేసి గద్దె నెక్కిన విధానాలను ప్రజలకు తెలియ జేస్తూ ప్రజాబ్యాలెట్‌ కరపత్రాలిస్తూ వివరించారు. దీనిపై ఎర్ర‌కోట జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన శూన్యమని ఆరోపించారు. రైతులకు వ్యవసాయ రుణమాఫీ అంటూ మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఇచ్చిన హమీలను నెరవేర్చలేదన్నారు. దీంతో వారంతా వడ్డీలు కట్టుకుంటూ అప్పుల పాలవుతున్నారని అన్నారు. దీంతో రైతులు చేసిన అప్పులు వాటిపై వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయన్నారు. టీడీపీ పుణ్యమాని రైతులు నేడు అప్పుల పాలవుతున్నారని మండిప‌డ్డారు. అర్హులైన వృద్దులు, వికలాంగులు, వితంతువులు పించన్ల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పించన్లు మంజూరు చేయడం లేదన్నారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని వారిని కూడా మోసం ప్ర‌భుత్వం మోసం చేసింద‌న్నారు. గ్రామాల్లో ఓవైపు మంచినీటి ఎద్దడి వున్నా నివారణ చర్యలు చేపట్టలేని దుస్థితిలో ప్రభుత్వం వుందని ధ్వ‌జ‌మెత్తారు. గ్రామాల్లో కనీస మౌళిక సదుపాయాలు కల్పించ‌లేక రాజధాని పేరుతో ముఖ్యమంత్రి, మంత్రులు అక్రమాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైయ‌స్‌ఆర్ సీపీకి మద్దతు ఇచ్చి టీడీపీకి బుద్ది చెప్పాలన్నారు. కార్యక్రమంలో వైయ‌స్‌ఆర్ సీపీ నాయకులు ధర్మకారి నాగేశ్వరరావు, సయ్యద్‌చాంద్, అల్లబా,గ్రామ వైఎస్‌ఆర్‌సీపీనాయకులు పెద్దారెడ్డి,శ్రీధర్‌రెడ్డి, విజయనరసింహరెడ్డి, లక్ష్మన్న,గోపాల్, నాగరాజు, కాలేబు, హరున్,తిప్పన్న, రంగన్న తదితరులు పాల్గొన్నారు.

Back to Top