రైతులు, డ్వాక్రామహిళలు అప్పులపాలు

కర్నూలుః రుణమాఫీ చేస్తానని చెప్పి  బాబు జనం నెత్తిన వడ్డీలు మోపాడని వైయస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా గొనెగండ్ల మండలం గంజిహళ్లి గ్రామంలో పర్యటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాబు హామీలు నమ్మి రైతులు, డ్వాక్రా మహిళలు అప్పుల పాలయ్యారని జగన్మోహన్ రెడ్డి అన్నారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు పెన్షన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.


Back to Top