చంద్రబాబు ప్రజాద్రోహి

కాకినాడ: అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వడం లేదు.. రోడ్లన్నీ పాడయ్యాయి.. డ్రైన్లు కూడా సరిగ్గా లేకపోవడంతో మురికినీరు స్తంభించిపోతోందంటూ కాకినాడ 16వ వార్డు డివిజన్‌ వాసులు గగ్గోలు పెట్టారు. కాకినాడ 16వ డివిజన్‌ కోటి స్తంభంపేట, పాత ఆస్పత్రివీధి, కొప్పాడ వారి వీధి, డొంకావారి వీధులలో పార్టీ కాకినాడ సిటీ  కోఆర్డినేటర ముత్తా శశిధర్‌ ఆధ్వర్యంలో  పార్టీ నాయకులు గడపగడపలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ రూపొందించిన ప్రజా బ్యాలెట్‌ను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను శశిధర్‌ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నామని, వీటి పరిష్కారానికి ప్రజల తరఫున పోరాడతామని హామీ ఇచ్చారు. 

ఆళ్లగడ్డ నియోజకవర్గం: అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించి ప్రజలకు ద్రోహం చేసిన చంద్రబాబు..మరోసారి మోసం చేసేందుకు  జనచైతన్య యాత్రల పేరుతో వస్తున్నాడని, ఆ ద్రోహం సమసిపోదని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రామలింగారెడ్డి విమర్శించారు.  మండలంలోని రెడ్డిపల్లె గ్రామంలో గడపగడపకు వైయస్‌ఆర కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఆయన ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబు పాలనలోని లోపాలను, ప్రభుత్వం చేసిన మోసాలను రైతులు, మహిళలు, నిరుద్యోగులకు వివరించారు. 


Back to Top