నమ్మించి... వంచించారుముదినేపల్లి(బొమ్మినంపాడు): అధికారంలోకి వస్తే పదేళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ వాగ్దానం చేశాయి. ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించి సామాన్య ప్రజలను దారుణంగా మోసగించారని, టీడీపీ పాలనలో బతకడం భారంగా మారిందని వైయస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు అన్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన బొమ్మినంపాడులో పర్యటించారు. బాబు మోసాలను ఎండగట్టారు.
శివారు గ్రామాలను పట్టించుకోలేదుయలమంచిలి(అచ్యుతాపురం): శివారు గ్రామాలను పట్టించుకోలేదు... రోడ్డు, డ్రైనేజీలు లేవు... రోగాలతో చచ్చిపోతున్నామంటూ కృష్ణాపురం మహిళలు వాపోయారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండలం కృష్ణాపురంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు పర్యటించారు. చంద్రబాబు పాలన అధ్వాన్నంగా ఉందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు పాలనకు సంబంధించి మార్కులు వేయాలని కోరగా ....బాబు పాలన పూర్తిగా రావణాసురిడి పాలన అని, అలాంటి పాలనపై మార్కులు వేయడం దండగని పలువురు గ్రామస్తులు నిప్పులు చెరిగారు.
బాబు అయితే వచ్చారు... జాబే రాలేదుమండపేట: బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. బాబు వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి ఊసేలేదని పలువురు వైయస్సార్‌సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానికంగా పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వందప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్‌ను ప్రజలకు అందజేసి బాబు పాలనపై మార్కులు వేయించారు. ఈసందర్భంగా బాబుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.