రాష్ట్ర సంపదను దోచేస్తున్న చంద్రబాబు

కర్నూలు

: రాష్ట్ర వనరులను చంద్రబాబు, ఆయన మంత్రులు దోచుకుతింటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎ్రరకోట జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. నియోజకవర్గ పరిధిలోని గోనెగండ్ల మండలం హెచ్‌.కైరవాడి గ్రామంలో ఎ్రరకోట జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ చేస్తున్న పోరాటాలను వివరించారు. అదే విధంగా వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి చేయబోయే అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Back to Top