హామీలు విస్మరించి అమరావతి జపం

సమస్యలతో సతమతం 
గిద్ద‌లూరు:  మాకు తాగేందుకు నీరు లేదు... ఉండేందుకు ఇళ్లు లేవు... అంత‌ర్గ‌త రోడ్ల‌ను ప‌ట్టించుకునే వారే లేరు. స‌మ‌స్య‌లు ప‌రిష్కరించాల‌ని అధికారుల‌ను కోరినా ఎలాంటి ఫ‌లితం లేదని కొమ‌రోలు మండ‌లం తాటిచెర్ల గ్రామ‌స్తులు ఆవేదన వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ ఐవీరెడ్డి గ్రామంలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ... దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మయంలో అంద‌రికీ ఇళ్లు వాచ్చాయ‌ని బాబు ప్ర‌భుత్వంలో ఒక్క ఇళ్లు కూడా మంజూరు కాలేద‌న్నారు. 

ఒక్క ఇల్లూ నిర్మించ‌లేదు
కొండేపి(టంగుటూరు): ఇళ్లు కట్టిస్తామని చెప్పడంతో బాబుకు ఓటేశాం. రెండున్నరేళ్లుగా కాలనీలకు కాలనీలు ఎదురుచూస్తూనే ఉన్నాయి. కానీ బాబు ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయ‌లేద‌ని టంగుటూరు బీసీ కాల‌నీవాసులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ వ‌రికూటి అశోక్‌బాబు టంగుటూరు బీసీ కాల‌నీలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.... ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు అందించ‌డంలో టీడీపీ శ్ర‌ద్ధ‌వ‌హించ‌డం లేద‌న్నారు. 


నిలువునా ముంచేసిన చంద్రబాబు 
మదనపల్లె:అధికారంలోకి వచ్చిన ఈరెండున్నరేళ్ళ కాలంలో ఎక్కడా ఒక్క ఇల్లు గానీ, పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఉద్యోగాలు గానీ ఇవ్వకుండా చంద్రబాబు అమరావతి జపంతోనే కాలం గడుపుతున్నాడని ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి మండిపడ్డారు. గడపగడపకూ వైయస్సార్‌సీపీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థానిక గాంధీపురం, పీఎన్‌టీకాలనీ తదితర ప్రాంతాలలో విస్తతంగా పర్యటించారు. రోడ్లు, కాలువలు, వీదదీపాలు వంటి మౌళిక సదుపాయాలు కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ప్రతి గడపలోనూ ప్రజలు ముఖ్యమంత్రిని తూర్పారపట్టారు.  రానున్నది మన ప్రభుత్వమే నని ఎవరూ అధైర్య పడొద్దని, ప్రజలకు ధైర్యం చెబుతూ కార్యక్రమాన్ని విజయవంతంగా మందుకు తీసుకెళ్ళారు. ఈకార్యక్రమంలో నాయకులు బాలకష్ణారెడ్డి, అంబేడ్కర్‌ చంద్రశేఖర్,మోహన్, కష్ణగోపాల్‌నాయక్,శివశంకర్, నారాయణ, కేసి నర్సింహులు, బండపల్లి వెంకటరమణ, తులసీరమణ తదితరులు పాల్గొన్నారు.
Back to Top