వైయస్ఆర్ ఆశయ సాధన కోసం వైయస్ జగన్ కు అండగా నిలుద్దాం

కర్నూలుః అవుకు మండలం శివవరం గ్రామంలో గడప గడప కు వైయస్సార్ కార్యక్రమాన్ని బనగానపల్లె నియోజకవర్గ ఇంచార్జ్ కాటసాని రామి రెడ్డి ఆధ్వర్యం లో నిర్వహించారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రజబ్యాలట్ ను ఇచ్చి , తెలుగుదేశం పార్టీ చేస్తున్న మోసాల గురించి సవివరంగ తెలియచేశారు. పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక ఇబ్బందులతో వ్యవసాయ పనులు చేయలేకపోతున్నామని, అప్పులు చేసి పండించిన ధాన్యం అమ్మితే నగదు ఇవ్వడం లేదని, రబీ సాగు కోసం పెట్టుబడికి చిల్లి గవ్వ కూడా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతుూ..అధికారం కోసం అమలుగాని హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

మూడేళ్ల పాలనలో బాబు ఒక్క ఇళ్లు, ఉద్యోగం గానీ ఇచ్చిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. పేదలకు ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు సహా అనేక సంక్షేమ పథకాలను అందించిన మహనీయుడు వైయస్ఆర్ అని రామిరెడ్డి గుర్తు చేశారు. వైయస్ఆర్ ఆశయ సాధన కోసం కంకణం కట్టుకున్న వైయస్ జగన్ కు అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలని కోరారు. వైయస్సార్సీపీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, సేద్యం, ఉపాధి, మౌళిక వసతులకే మొదటి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.  
Back to Top