2019లో వైయస్‌ జగనే సీఎం

 
అనంతపురం: మనకు మంచి రోజులు రాబోతున్నాయని, 2019లో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంతకల్‌ నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకట్రామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం గుత్తి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు  మహాసంకల్పంతో ప్రజా సంకల్ప యాత్రతో మన ఊరికి వచ్చిన వైయస్‌ జగన్‌కు మనమంతా తోడుగా నిలుద్దామన్నారు. మనకు  నవరత్నాలాంటి పథకాలను వైయస్‌ జగన్‌ ఇవ్వనున్నారని తెలిపారు. 45 ఏళ్లకే పింఛన్‌ ఇవ్వనున్నారు. నెలకు రూ.2 వేలు పింఛన్‌ ఇస్తారని చెప్పారు.  వైయస్‌ రాజశేఖరరెడ్డి కంటే రెండు అడుగులు వైయస్‌ జగన్‌ ముందుకు వేసి బ్రహ్మండమైన సంక్షేమ పథకాలు ప్రకటించారన్నారు. వైయస్‌ జగన్‌ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. 2019లో దేవుని దయవల్ల ,ప్రజల ఆశీస్సులతో తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే జిల్లా సమస్యలు పరిష్కరిస్తారన్నారు. హంద్రీనీవా గుంతకల్‌ నియోజకవర్గం నుంచి వెళ్తున్నా కూడా చెరువులకు నీరివ్వడం లేదన్నారు. గుంతకల్, గుత్తి, పామిడి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీరివ్వాలని వైయస్‌ జగన్‌ను కోరారు. నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయని, వాటన్నింటిని తిరిగి ప్రారంభించాలని కోరారు. ఇండస్ట్రీయల్‌ హబ్‌గా గుంతకల్‌ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలన్నారు. మున్సిపాలిటీగా మార్చి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని తెలిపారు. టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని కోరారు. మా సమస్యలకు పరిష్కారం ఒక్క వైయస్‌ జగనే అని నమ్ముతున్నామని విశ్వసించారు.
 
Back to Top