అవిశ్వాసంపై ఏడోసారి నోటీసు


ఢిల్లీ:  హోదాపై చర్చ జరిగే వరకు వదిలిపెట్టమని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రానికి ఏడో సారి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఏడో సారి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కొద్ది సేపటి క్రితమే సుబ్బారెడ్డి నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రత్యేక హోదాపై లోక్‌సభలో చర్చ జరిగే వరకు వదిలిపెట్టమని స్పష్టం చేశారు. చర్చ జరిగే వరకు నోటీసులు ఇస్తునే ఉంటామని చెప్పారు. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్, అన్నా డీఎంకే ఎంపీలు ఆందోళన చేపట్టడంతో కొద్ది సేపటికే సభను స్పీకర్‌ వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు సభ ప్రారంభం కాగానే పరిస్థితి అలాగే ఉండటంతో సభను మళ్లీ వాయిదా వేశారు. దీంతో మరోమారు అవిశ్వాసం నోటీసును ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అందజేశారు.
 
Back to Top