యువనేత విడుదలకు చిలుకూరులో ప్రదక్షిణలు

హైదరాబాద్: జననేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ కళంకం లేకుండా జనంలోకి రావాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చిలుకూరు బాలాజీని వేడుకున్నారు. ఆ పార్టీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి చి లుకూరు బాలాజీ దేవాలయం వరకు 100 మందితో 40 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పాదయాత్ర చిలుకూరు బాలాజీ దేవాలయానికి చేరుకుంది. జగన్‌మోహన్‌రెడ్డి త్వరగా బయటకు రావాలని స్వామివారిని కోరుతూ పార్టీ నాయకులు 11 ప్రదక్షిణలు చేశారు.
అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఐటీ విభాగం రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికార, ప్రతి పక్ష పార్టీలు, సీబీఐ కుమ్మక్కై కుట్రపూరితంగా జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమం గా అరెస్టు చేశారని ఆరోపించారు. ఎ లాంటి అవినీతిని రుజువు చేయిని పక్షంలో ఎవరికైనా 90 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వాలనేది చట్టంలో ఉన్నా జగన్‌కి మాత్రం బెయిల్ ఇవ్వకుండా కుట్రలు పన్నుతున్నారన్నారు. వారు ఎన్ని కుట్రలు పన్నినా ఆయన మా త్రం నిజాయితీగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ బ యటకు వచ్చిన తర్వాత చిలుకూరు బాలాజీ దేవాలయంలో 108 ప్రదక్షిణ లు చేసి మొక్కు తీర్చుకుంటామన్నా రు. మరోపక్క దివంగత మహానేత వైఎస్‌ఆర్ దూరమైన మూడేళ్లలో రా ష్ర్టం 30 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ 2014 వరకు అధికారాన్ని కాపాడుకోవడానికే చూస్తుంది తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పాదయాత్ర చేసినవారిలో రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్, ఐటీ విభాగం నాయకులు డాక్టర్ ప్రపుల్లారెడ్డి, వీఎల్‌ఎన్ రెడ్డి, హర్షవర్థన్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, కేతు మాల్యాద్రి, ఆదిత్య, శివశంకర్‌రెడ్డి, శివారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నారాయణరెడ్డి, వెంకటేష్, వెంకట్‌రెడ్డి, శ్రీవర్ధన్, మోహన్, గిరి ఉన్నారు.

Back to Top