నిరుద్యోగుల ఆందోళన

తిరుపతిః ఏపీ బడ్జెట్ లో నిరుద్యోగ భృతి ఊసే లేకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో వైఎస్సార్సీపీ విద్యార్థి యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటికో  ఉద్యోగం,  ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2 వేలు  నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఉన్న ఉద్యోగాలు
ఊడగొడుతున్నారని విద్యార్థులు మండిపడ్డారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ,లోకేష్, టీడీపీ నాయకులకు దోచుకునే ఉద్యోగాలు వచ్చాయని విద్యార్థులు ఫైరయ్యారు. బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకుండా దగా చేశారని నిప్పులు చెరిగారు. యూనివర్సిటీ అభివృద్ధికి మొండి చేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న టీడీపీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. 
Back to Top