ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాక్షేత్రంలోకి వెళతాం

వరంగల్‌లో టీఆర్‌ఎస్‌కు ప్రజాతీర్పు మెజారిటీ ఇచ్చినా  అది ఎంతోకాలం నిలవదని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఓడలు బండ్లు...బండ్లు ఓడలవుతాయని, దీనికి ఎంతో సమయం పట్టదన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రాజకీయపార్టీలతో కలసి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాక్షేత్రంలోకి వెళతామన్నారు. అప్పుడు ప్రభుత్వం  ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు.  జిల్లా సమగ్రాభివృద్ధి, పలు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద... పొంగులేటి చేపట్టిన రెండ్రోజుల దీక్ష మంగళవారం సాయంత్రం ముగిసింది.

Back to Top