టీవైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణంపై అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొనసాగుతుంది. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరుగుతుంది. సమావేశంలో పార్టీ తెలంగాణ విభాగం సీనియర్‌ నేతలు కొండా రాఘవరెడ్డి, శివకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, సీఈసీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.     
Back to Top