స్పీక‌ర్ ను క‌ల‌వ‌నున్న‌వైఎస్సార్సీపీ బృందం

హైద‌రాబాద్‌) అసెంబ్లీ సమావేశాల‌కు ముందే స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ను క‌ల‌వాల‌ని వైఎస్సార్సీపీ శాస‌న‌స‌భ ప‌క్షం నిర్ణ‌యించింది. ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ సూచ‌న‌ల మేర‌కు సీనియ‌ర్ ఎమ్మెల్యేల బృందం అసెంబ్లీకి వెళుతోంది. పార్టీ నుంచి వెళ్లిపోయి తెలుగుదేశం కండువా క‌ప్పుకొన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేల‌ను అన‌ర్హులుగా చేయాల‌ని విన్న‌వించ‌నున్నారు. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చూపించిన ప్ర‌లోభాల‌కు లోనై నిబంధ‌న‌ల‌కు, నిబ‌ద్ద‌త‌కు వ్య‌తిరేకంగా పార్టీ ఫిరాయించిన వైనాన్ని ఆయ‌న దృష్టికి తీసుకొని వెళ్ల‌నున్నారు. 
Back to Top