జ‌గ‌న‌న్న‌కు తోడుగా..జ‌నం నిండుగా


 
రాష్ట్ర‌వ్యాప్తంగా హోరెత్తిన సంఘీభావ పాదయాత్రలు
వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు మ‌ద్ద‌తు వెల్లువ‌
నవరత్నాలను వివరించి.. ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టిన నేతలు

అమ‌రావ‌తి:  జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర‌వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు నిర్వహించిన సంఘీభావ పాదయాత్రలు శుక్రవారం హోరెత్తాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు నిర్వహించిన బహిరంగ సభలకు ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.  ‘సంక్షేమ పాలనంటే అంటే ఎలా ఉంటుందో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చూసిన నేపధ్యంలో గత నాలుగేళ్లుగా అలాంటి వ్యవస్థ్థ, పరిస్థితులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు మళ్లీ ఆ రాజన్న పాలన రావాలి అని మనసారా కోరుకుంటున్నారు. అందుకే జననేత వైయ‌స్‌ జగన్‌ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అశేష ప్రజలు బ్రహ్మరథం పడుతుండగా, ఆయనకు సంఘీభావంగా జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిర్వహించిన  పాదయాత్రలకు ప్రజలు హారతులు పట్టారు.  పేదోళ్లకు పింఛను ఇవ్వాలన్నా... పక్కా ఇళ్లు పొందాలన్నా....జన్మభూమి కమిటీల  మెప్పు పొందాలి. లేకుంటే లంచాలు ఇవ్వాలి. ఇదేమి విపరీతం అంటూ  అంటూ తమ గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదనను ప్రజలు  మనసువిప్పి చెప్పుకున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలు తమ బతుకుల్లో సంతోషం నింపుతుందని, అందుకు జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.

♦ పెనమలూరు నియోజకవర్గంలో మచిలీపట్నం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, పార్టీ సీనియర్‌ నేత కొలుసు పార్థసారథి ఆ«ధ్వర్యంలో తాడిగడప నుంచి పోరింకి, పెనమలూరు వరకు 8 కి.మీ వరకు పాదయాత్ర కొనసాగింది. అనంతరం పెనమలూరు సెంటర్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. పాదయాత్రలో పార్టీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌ తాతినేని పద్మావతి, యువవజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాకర్ల వెంకటరత్నం, ఉయ్యూరు ఎంపీపీ తుమ్మూరు గంగారత్నం, నాయకులు కీలారు శ్రీనివాసరావు, కొఠారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
♦ పెడన నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త జోగి రమేష్‌ ఆధ్వర్యంలో ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో కౌన్సిలర్లు కటకం ప్రసాద్, మెట్ల గోపిప్రసాద్, గరికిముక్క చంద్రబాబు, నాయకులు ఆయూబ్‌ఖాన్, తలుపుల కృష్ణ, గోరిపర్తి రవికుమార్, సంగా మధు, జక్కా అర్జున భాస్కర్, తాతాజీ, మలిశెట్టి రాజబాబు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
♦ నూజివీడు పట్టణంలో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే మేకాప్రతాప్‌ అప్పారావు నేతృత్వంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. పట్టణంలో అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు పాదయాత్రలో ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పగడాల సత్యనారాయణ, ముసునూరు మండలం అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బసవా భాస్కరావు తదితరులు పాల్గొన్నారు.
♦ తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో వైయ‌స్ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రక్షణనిధి ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. అయ్యప్ప ఆలయం నుంచి రాజుపేట వరకు పాదయాత్ర చేశారు. అనంతరం తిరువూరు పట్టణంలోని చీరాల సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. పాదయాత్రలో పార్టీ మండల అధ్యక్షుడు వీరారెడ్డి, నాయకులు శ్రీనివాసరావు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
♦ పామర్రు నియోజకవర్గంలో మొవ్వమండలం నిడుమోలు గ్రామం నుంచి కూచిపూడి వరకు పార్టీ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్‌ నేతృత్వంలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కూడిపూడిలో బహిరంగ సభ నిర్వహించారు.
♦ గన్నవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకకర్త యార్లగడ్డ వెంకట్రావ్‌ నేతృత్వంలో గన్నవరంలో పాదయాత్ర నిర్వహించారు. నాయకులు కాసరనేని గోపాలరావు, ఎండీ గౌసాని, తుల్లిమిల్లి ఝాన్సీలక్ష్మీ, మద్దినేని వెంకటేశ్వరరావు, నీలం ప్రవీణ్‌కుమార్, యార్కరెడ్డి నాగిరెడ్డి, నక్కా గాంధీ వందలాది మంది  కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
♦ అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు నేతృత్వంలో ఘంటసాల నుంచి శ్రీకాకుళం వరకు సంఘీభావ పా దయాత్ర సాగింది. పాదయాత్రలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహరావు, ఘంటశాల మండల కన్వీనర్‌ వేమూరి వెంకట్రావ్‌తోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
♦ నందిగామ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు నేతృత్వంలో నందిగామ మండలం రాఘవాపురం గ్రామం నుంచి కమ్మవారి పాలెం, పల్లగిరి గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం నందిగామలో బహిరంగ సభ జరిగింది.
♦ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర 3వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ  సమన్వయర్త యలమంచిలి రవి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. పటమట రైతుబజార్‌ ఎదురుగాఉన్న ప్రాంగణంలో జరిగిన ఈ సభలో యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి తంగిరాల రామిరెడ్ది, వైద్య విభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ మెహబూబ్‌ షేక్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
♦ కైకలూరు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈనెల 25న ప్రారంభమైన సంఘీభావ పాదయాత్ర  కలి దిండి, ముదినేపల్లి, మండవల్లి మండలాల మీదుగా గురువారం కైకలూరు గాంధీబొమ్మ సెంటర్‌కు చేరుకుంది. 27 గ్రామాల్లో 52 కి.మీలు దూరం సాగింది. పార్టీ నాయకులు బొడ్డు నోబుల్, పోసిన పాపారావుగౌడ్, చేబోయిన వీర్రాజు, భిక్షాలు, జహీర్, లింకన్‌ తదితరులు పాల్గొన్నారు.
♦ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సంఘీభావ పాదయాత్ర పార్టీ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాస్‌  గురువారం సాయంత్రం ముగిసింది. అనంతరం పంజా సెంటర్‌లో బహిరంగ సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్‌ ఆసీఫ్, నగరపాలక సంస్థ  పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ బండి పుణ్యశీల, కార్పొరేటర్లు బుల్లా విజయకుమార్, బి.సం«ధ్యారాణి తదితరులు హాజరయ్యారు.
♦ విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం పార్టీ సమన్వకర్త మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ప్రజా సంకల్పయాత్రకు మద్దతుగా  సంఘీభావ బహిరంగ సభ అజిత్‌ సింగ్‌నగర్‌లోని పైపులురోడ్డులో బహిరంగ సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులు బి.జానారెడ్డి, తిట్ల రామలింగమూర్తి, శర్వాణి మూర్తి, ఎండీ రుహుల్లా, మోదుగుల గణేష్, వెన్నం రత్నారావు తదితరులు పాల్గొన్నారు.


తాజా వీడియోలు

Back to Top