గ‌ర్భిణిని ఆదుకున్న వైయ‌స్ఆర్ సీపీ యూత్‌

గిద్ద‌లూరు: ర‌క్త‌హీన‌తతో బాధ‌ప‌డుతున్న గ‌ర్భిణి మ‌హిళ‌ల‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ‌జ‌న విభాగం నాయ‌కులు ర‌క్త‌దానం చేసి ఆదుకున్నారు. గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో షేక్ హ‌బీబ అనే గ‌ర్భిణి ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డుతుంది. దీంతో విష‌యం తెలుసుకున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ‌జ‌న విభాగం నాయ‌కులు, పార్టీ కో-ఆర్డినేట‌ర్ ఐవీరెడ్డి యువ‌సేన స‌భ్యుడు షేక్ ఇమ్రాన్ ఆమెకు ర‌క్తం ఇచ్చి ఆదుకున్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ యూత్ లీడ‌ర్ ప‌ల్లె అశోక్‌రెడ్డి, జిల్లా ఐటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చ‌ల్లా అశోక్‌రెడ్డి, యువ‌జ‌న విభాగం నేత‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top