వైయ‌స్ జ‌గ‌న్‌కు ఒక్క‌సారి అవ‌కాశం ఇవ్వండి


నెల్లూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఒక్క‌సారి ముఖ్య‌మంత్రిగా అవ‌కాశం ఇవ్వాల‌ని నెల్లూరు ఎమ్మెల్యే, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిల్ కుమార్ యాద‌వ్ కోరారు. వైయ‌స్‌ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై నెల్లూరులో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాజకీయ విలువలను వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాటిస్తున్నారని తెలిపారు.  ఎన్నికల సమయంలో చంద్రబాబు రాష్ట్రానికి పది కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు. ప్రస్తుతం కేసుల నుంచి బయటపడేందుకు ఇప్పడు ప్యాకేజీ అంటు​న్నారని విమ‌ర్శించారు. రాష్ట్రానికి సంజీవ‌ని అయిన ప్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్ జ‌గ‌న్ గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేశార‌న్నారు. యువ‌భేరి కార్య‌క్ర‌మాల ద్వారా యువ‌త‌ను చైత‌న్య‌వంతం చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌ని, అంద‌రూ వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుతున్నార‌న్నారు. ఎంపీ మేకపాటి మాట్లాడుతూ..  ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు నాయుడి వైఖరి సరికాదని, ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. 

Back to Top