<br/>హైదరాబాద్: చంద్రబాబుకు కేంద్రంతో ఉన్న ఒప్పందం ఏంటో చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఆరోజు చంద్రబాబు చేసుకున్న చీకటి ఒప్పందంతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఏంటీ మీ ఫార్మూలా అని నిలదీశారు. అఖిలపక్షాన్ని గుర్తించమని, ప్రతిపక్షాన్ని గుర్తించమని చెబుతూ ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.